రాగం : షణ్ముఖప్రియ -- వాణి ననుగావుమా శార్వాణి నను బ్రోవుమా
వాణి ననుగావుమా -- శార్వాణి నను బ్రోవుమా
నమ్మిన వారిని - ఇమ్ముగ బ్రోతువు
అమ్మా నను బ్రోవ - అర మర చేయకు !! వాణి ననుగావుమా !!
1. సకల విద్యలకు - సమరస భాషిణి
వికసించెను నా -హృదయము నిను వేడా
పలికింపుము నా - వాక్కుల శాస్త్రము
పద్మజ రాణి - పరమ కృపానిధీ !! వాణి ననుగావుమా !!
2. వీణాపాణి - విద్య విభూషిణి
విరించి రాణి - దివ్య స్వరూపిణి
అవతరించుమా - ఆనందభారతి
రామకృష్ణ దాస - భక్త పోషిణి !! వాణి ననుగావుమా !!

No comments:
Post a Comment