Sunday, May 28, 2017

రాగం : కళ్యాణి -- దయగనుమా శారదా మాతా

రాగం : కళ్యాణి    --   దయగనుమా శారదా  మాతా

దయగనుమా శారదా   - మాతా !! 2!!

1. మెల్లగ  మీటును - చేతిలో వీణా
వెల్లు  విరియగా - నాద ప్రవీణా
వీనుల విందుగ - వినవలె వీణా
శ్రీకర జీవన - నా జన్మ పావని !! దయగనుమా శారదా !!
2 పారే నదులే - పొంగుచు పొరలే
కరగి ప్రవహించు- పర్వతి  రావే
తాండవ మాధులే - అంబరవీధిలో
సంబరపడువలె - సర్వజగాలను  !! దయగనుమా శారదా !!
3. సప్త స్వరములు - సుతులు పలుకవే
సప్త కార్యములు - శుభమునీయవే
కవితాగానము -కవులకీయవే
శృతి చేసెనులే -కవి సోమయాజులు  !! దయగనుమా శారదా !!



No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...