Wednesday, May 31, 2017

రామాయనెడి రూపమునే


రామాయనెడి రూపమునే

రామాయనెడి రూపమునే ....
నిత్యమూ నీవు కొలువుము రా ....
కొలిచినవారి కోర్కెలు తీర్చే
కల్పవృక్షమే శ్రీ రాముడు రా ... -- రామా --


కోరీకోరగా వరముల నొసగే,
కోదండ రాముడే ఆ వరదుడు రా
రామ , రామ యన హనుమను గాచిన
భక్త వత్సలుడు ఈ రాముడు రా ....... -- రామా --


గోదావరితట మంత్రపురిష ,
శ్రీ రఘునందన శ్రితజనపోష
నీ పద కమలమే నేను నమ్మితిరా
నీ నిజ దాసిని బ్రోవగ రావా ........ -- రామా --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...