ధ్యానించి తరించవే హృదయమా
ధ్యానించి తరించవే హృదయమా
విజ్ఞరాజునూ గజరాజవదనునీ -- ధ్యానించి --
ఆయమ్మ గౌరితో - అరమోడ్పు కనులతో
ఆ వెండి కొండపై - కడునిండు గుండెతో
నెలకొన్న సాంబుని - ఒడిలోన గణపతికి
కలనైన ఇలనైన కలతలే పోవంగ -- ధ్యానించి --
చిరునవ్వు మోములో - చల్లన్ని చూపుతో
తోరపు బొజ్జతో - మ్రోగేటి గజ్జతో
గుజ్జురూప ధారుని - ముజ్జగాల దేవుని
కలనైన ఇలనైన కలతలే పోవంగ -- ధ్యానించి --
No comments:
Post a Comment