Wednesday, May 31, 2017

జయగణనాయక వినాయకా


జయగణనాయక వినాయకా

జయగణనాయక వినాయకా
వినతిని వినుము శుభాదాయకా
జయ పార్వతి తనయా జయ విజ్ఞరాజా -- జయ --


మూషిక వాహనా ముల్లోక పూజిత
విగ్నాలు తొలగించు విజయ ప్రదాత --మూషిక --
ఆర్తజన రక్షక భక్తజన పాలా
దీనబాంధవా కరుణ - దీవించి మమ్మేలు -- జయ --


ఏ దేవుని వేడినా - ఏ పూజలు చేసినా
ఏ నోములు చేసినా - ఏమని వేడినా -- ఏ దేవుని --
శుభములనోసగే - విగ్నరాజు నీవని
ముందుగ నిన్నే - పూజింతుమయ్య -- జయ --


గణముల నాయకా - నీ మహిమను ఏరుగకు
త్రిముఖుడునీతో - పందెము కట్టగా -- గణ --
సర్వ ధర్మములు - త్రుటిలో తెలిపి
త్రిముఖుని గెలిచినా - బుద్దిశాలివి -- జయ --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...