Wednesday, May 31, 2017

రాగం : మోహన - ఘనా ఘన సుందరా

రాగం : మోహన - ఘనా ఘన సుందరా 

ఘనా ఘన సుందరా  కరుణారస మందిరా 
అది పిలుపో మేలు కోలుపో 
అతి మధుర మధుర మధురమో ఓం కారమో 
పాండురంగ పాండురంగ !!  ఘనా ఘన !!

1. ప్రబాతమందిర పూజావేళ 
నీ పదసన్నిది నిలబడి నీ పద పీఠిక తలనిడి 
నిఖిల జగతికి నివాళు లిడఁగ 
వేడెద కొనియాడెద 
పాండురంగ పాండురంగ !!  ఘనా ఘన !!

2. గిరులు ఝరులు విరులు  తరులూ 
నిరతము నీనామ గానమే నిరతము నీ నామ ధ్యానమే 
సకల చరాచర లోకేశ్వరేశ్వర 
శ్రీకర భవహర 
పాండురంగ పాండురంగ !!  ఘనా ఘన !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...