రాగం : వరాళి - అంతా రామమయం బీ జగమంతా రామమయం
అంతా రామమయం - ఈ జగమంతా రామమయం
1. అంతరంగమున ఆత్మారాము డ
నంత రూపమున వింతలు సలుపగ || అంతా ||
2. సోమ సూర్యులును సురలు తారలును
ఆ మహాంబుధులు నఖిల జగంబులు || అంతా ||
3. అండాండంబులు పిండాండంబులు
బ్రహ్మాండంబులు బ్రహ్మ మొదలుగ || అంతా ||
4. నదులు వనంబులు నానా మృగములు
విదిత కర్మములు వేదశాస్త్రములు || అంతా ||
5. అష్ట దిక్కులును ఆదిశేషుడును
అష్ట వసువులును అరిషడ్వర్గము || అంతా ||
6. ధీరుడు భద్రాచల రామదాసుని
కోరిక లొసగెడి తారక నామము || అంతా ||
No comments:
Post a Comment