Monday, May 29, 2017

రాగం : బౌలి -వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము

రాగం : బౌలి -వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము లేక విర్రవీగేయహంకారి వెర్రివాడు


వెర్రివాడు వెర్రిగాడు విష్ణుదాస్యము లేక విర్రవీగేయహంకారి వెర్రివాడు

నాలుకపై శ్రీహరినామమిట్టే వుండుగాను జోలితో మరచిననీచుడే వెర్రివాడు
అలరియీజగమెల్లా హరిరూపై వుండగాను వాలి తలపోయనివాడు వెర్రివాడు

కూరిమి బ్రహ్మాండాలు కుక్షినున్న హరికంటే కోరివేరె కలడనేకుమతి వెర్రివాడు
చేరి తనయాత్మలోన శ్రీరమణుడుండగాను దూరమై తిరుగువాడే దొడ్డ వెర్రివాడు

సారపు శ్రీవేంకటేశు శరణాగతి వుండగా సారె గర్మములంటేడి జడుడు వెర్రివాడు
చేరువ నాతనిముద్ర చెల్లుబడి నుండగా మోరతోపైవున్నవాడే ముందు వెర్రివాడు

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...