రాగం : వసంతం - శోభనమే శోభనమే వైభవముల
శోభనమే శోభనమే వైభవముల పావన మూర్తికి
అరుదుగ మును నరకాసురుడు సిరులతో జెరలు దెచ్చిన సతుల
పరువపు వయసుల బదారు వేలను సొరిది బెండ్లాడిన సుముఖునికి
చెందిన వేడుక శిశుపాలుడు అంది పెండ్లాడగ నవగళించి
విందువలెనె తా విచ్చేసి రుకుమిణి సందడి బెండ్లాడిన సరసునుకి
దేవదానవుల ధీరతను దావతిపడి వార్థి దరుపగను
శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన శ్రీ వేంకటగిరి శ్రీనిధికి
No comments:
Post a Comment