Wednesday, May 31, 2017

రాగం : భీం పలాస్ - నిన్ను చెర వేడితిమి

రాగం : భీం పలాస్ - నిన్ను చెర వేడితిమి ( నన్ను దోచుకొందువటే అను వరుస )

నిన్నుచేర వేడితిమి  -  రఘువర శ్రీ రామా 
అందరినీ గాచు తండ్రి - నీవే శ్రీ రామా !! నిన్నుచేర వేడితిమి !!

1. కన్నులున్నవి నీ  మోహన వదనము కాంచుటే 
కాలమంత రామ దర్శించి నిలిచి పోనా 
ఉన్నవి ఇరు కరములూ నీ దివ్య పద సేవలకే 
పదసేవలే భాగ్యము కరుణించవయా రామా !! నిన్నుచేర వేడితిమి !!
 
2, నీ స్మరణే ఊపిరిగా - రామ నిన్ను కొలచితి 
కరుణ చూప దేవా నీ దయను మార్చుకోవా 
నీ సేవకే మా ప్రాణము మరువలేము మేమూ 
తండ్రీ  దయా  నిలయ దయగనవా రామా !! నిన్నుచేర వేడితిమి !!


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...