Wednesday, May 31, 2017

రాగం : కన్నడ - ఒక్కసారి రావాలి స్వామి

రాగం : కన్నడ - ఒక్కసారి రావాలి స్వామి 


ఒక్కసారి రావాలి స్వామి  -  ఎన్నాళ్లుగ పిలుస్తుంటి స్వామి
వేడి వేడి అన్నములో  - వెన్నపూస నీ వేస్తా
ఆవకాయ వడ్డియించి -  పక్కనుండి తినిపిస్తా !! ఒక్కసారి రావాలి !!

1. పళ్ళు  తెచ్చి పెట్టేందుకు - శబరమ్మను కాను నేను
ఫలహారాలిచ్చేందుకు - మహారాజును కానునేను
పేదింట్లో వంట తింటే - నీ గొప్పేమీ తగ్గదులే  !! ఒక్కసారి రావాలి !!

2. పూల పరుపు వేసేందుకు -దొరబిడ్డను కాను నేను
గాలి నీకు విసిరేందుకు - చెలికత్తెలు లేరయ్యా
అరుగు మీద కూర్చుంట - నుదురపోవా స్వామీ
తలా నిమురుతుంటూ నిదురపోవా స్వామి !! ఒక్కసారి రావాలి !!

3. పిడికిదంత అతుకులకే - పొంగిపోయినావంట
పడవ నిన్ను దాటిస్తే - పరవశించినావంట
ఎంతటి దయగలవాడవో - కాళీకృష్ణుడనుకొంటి
అంతట  నా స్వామి - నువ్వు నా ఇంటికి రావేమిటి !! ఒక్కసారి రావాలి !!


No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...