Monday, May 29, 2017

రాగం : మాల్ కోస్ --కొండలలో నెలకొన్న కోనేటి రాయడు

రాగం : మాల్ కోస్  --కొండలలో నెలకొన్న కోనేటి రాయడు

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు కొండలంత వరములు గుప్పెడువాడు

కుమ్మర దాసుడైన కురువరతినంబి యిమ్మన్న వరములెల్ల నిచ్చినవాడు
దొమ్ములు సేసినయట్టి తొండమాం చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు

అచ్చపు వేడుకతోడ ననంతాళువారికి ముచ్చిలి వెట్టికి మన్ను మోచినవాడు
మచ్చిక దొలక దిరుమలనంబి తోడుత నిచ్చనిచ్చ మాటలాడి నొచ్చినవాడు

కంచిలోన నుండ దిరుకచ్చినంబి మీద కరుణించి తనయెడకు రప్పించిన వాడు
ఎంచి యెక్కుడైన వేంకటేశుడు మనలకు మంచివాడై కరుణ బాలించినవాడు

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...