Sunday, June 4, 2017

పద్యములు ఘంటసాల 1


 పద్యం : కనకదుర్గ పూజామహిమ 


నాతిన్‌ గానను రాజ్యమూ గనను, కాంతారాన గాసిల్లితిన్‌
ఈ తాపమ్ము భరింపజాలనికా..ఆ.. నన్‌ హింసించి శోధించకే
చేతుల్ మోడిచి చెంపలేసుకుని నే చేసేను నీ సేవలన్‌
మాతా!.. మాతా! కనులు వీడెనే దొసగులన్‌ మన్నించి నన్నేలవే!
నన్నేలవే! నన్నేలవే!


కాళహస్తి మహత్మ్యం (1954)

దేవా.. సేవకులన్న నీచమతులై దీనాళి వేధించు దు
ర్భావుల్ యీ నరజాతి, ఈ నరజాతి పూజకును ఆ... బ్రహ్మాది దేవేంద్ర సత్సే
వావ్రాతము వీడీ, భిక్షకుడవై సేవింప యీ బంటుకే
ఈవే బంటుగ వచ్చినావు భళిరా... శ్రీకాళహస్తీశ్వరా
శ్రీకాళహస్తీశ్వరా... శ్రీకాళహస్తీశ్వరా...

హీ శంకరా! మాం పాహీ శంకరా!
దీనాళి రక్షించు దేవ దేవా! |దీనాళి|
నా గతి నీవయ్య దేవ దేవా! |నా గతి|
పాహీ శంకరా! మాం పాహీ శంకరా!


దేవా! దివ్య కృపాకరా భవహరా! దీనావనా శంకరా!
నీ వాల్లభ్య బృహంచలామృత ఝరుల్ నీ పుత్రుపై జల్లగా
భావాతీత మనోజ్ఞ నేత్రములు విస్ఫారించినావా ప్రభో!
సేవా భాగ్యము కల్గజేయుమా దయన్ శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తీశ్వరా!

చేకొనవయ్య మాంసమిదె చెల్వుగదెచ్చితి బాస జొప్పునన్
ఆకొనియుంటివేమొ కడుపార బిరాన భుజించవయ్య యీ
లోకులు చూడరయ్య భువిలోని క్షుదార్తుల బాధలెన్నడున్
శ్రీకర కాళహస్తి శశిశేఖర దివ్య కృపాకరా హరా! హరా!
ఆ..ఆ..ఆ..ఆ

కృష్ణ లీలలు (1959)
నిరత సత్య ప్రౌఢి ధరణినేలిన హరిశ్చంద్రుడీ ధరబాసి చనగలేదె
ఎల్ల లోకములేలి యెసగు శ్రీనలరాజు తనవెంట భూమిని గొనుచు చనెనే
కృత యుగంబునకు అలంకృతిజేయు మాంధాత సిరిమూట గట్టుక నరుగ గనెనే
జలధి అలరారు శ్రీరాముడు వుర్విపై యిప్పుడు ఉన్నవాడె


ఎందరెందరొ రాజులు ఏగినారు!
బావా..
ఎందరెందరో రాజులు ఏగినారు
ఒక్కరును వెంట గొనిపోవరుర్వితలము
నీవు మాత్రము రాజ్యంబు నీదు సిరియు తలను కట్టుక పోదువో ధర్మ హృదయా
ఆ..ఆ..ఆ..

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...