ఘంటసాల గారి పద్యములు 2
ఉమా సుందరి (1956)
ఆపదలెన్ని వచ్చిన గృహంబున తాతల నాటి నుండి నీ
దీపము నిత్యమై వెలిగె దీనికి యిప్పుడు ముప్పు వచ్చెనే
నేపగిదిన్ సహింతు పరమేశ్వరా నన్ను క్షమింపవయ్య నీ
దీపము సన్నగిల్లి కడతేరక ముందెటకేని పోయెదన్!
పద్యం: ప్రాణసమానలై వరలు
ఉ.మా. ప్రాణ సమానలై వరలు భార్యలు నల్వురె నాకు, వేరె యే
మానిని నిల్చెనో యిచట, మాతకదా పరకాంత మాయవే
యైననిదే జగజ్జనని యాన బయల్ పడి రాగదమ్మ యీ
దీనుని పుత్రవత్సలత దీవన సేయగదమ్మ తల్లివై!
సీ. సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు
ఉ.మా. ప్రాణ సమానలై వరలు భార్యలు నల్వురె నాకు, వేరె యే
మానిని నిల్చెనో యిచట, మాతకదా పరకాంత మాయవే
యైననిదే జగజ్జనని యాన బయల్ పడి రాగదమ్మ యీ
దీనుని పుత్రవత్సలత దీవన సేయగదమ్మ తల్లివై!
సీ. సకల ధర్మానుశాసకుడైన దేవేంద్రు
తనయ పతిన్ బాసి తనరగలదే…!
పాపరాశి దహించు వహ్నిదేవ కుమారి
ఆత్మేశు నెడబాసి అలరగలదే…!
పాపరాశి దహించు వహ్నిదేవ కుమారి
ఆత్మేశు నెడబాసి అలరగలదే…!
పరమ పావనుడైన వరుణదేవుని సుత
భర్తను విడనాడి వరలగలదె!
నాగస్వరానంద నాగరాజ సుపుత్రి
భర్తను విడనాడి వరలగలదె!
నాగస్వరానంద నాగరాజ సుపుత్రి
జీవితేశుని వీడి చెలగగలదే..ఏ..!
తే.గీ. పార్వతీదేవి కృపను నా భార్యలైన
అమరకాంతలు పతివ్రతలగుదురేని
ఇపుడు వారల గప్పిన యింద్రజాల మహిమ
తృటిలోన మటుమాయమగునుగాక! ఆ..ఆ..
తే.గీ. పార్వతీదేవి కృపను నా భార్యలైన
అమరకాంతలు పతివ్రతలగుదురేని
ఇపుడు వారల గప్పిన యింద్రజాల మహిమ
తృటిలోన మటుమాయమగునుగాక! ఆ..ఆ..
తారసిల్లిన బాటసారులంతే కదా, ఆ..ఆ..
ఆలుబిడ్డలు జీవయాత్రలోన..ఆ..ఆ
సిరిసంపదలు కల్ల! మెరుపులంతే కాని
శాశ్వతంబుకావు జగతిలోన..ఆ..ఆ..
సౌఖ్యంబు సున్న! కష్టతరంగములె కాని
సంసార దుర్భర జలధిలోన..ఆ.
బంధుమిత్రులు చుట్ట పక్కాలు దొంగలు
కాని, కష్టాలలో కానబడరు!
ప్రబల మాయావిమోహ విభ్రాంతమైన
కపట నాటకమింతియెకాని ప్రకృతి మిధ్య!
ప్రేమ బంధాలెల్ల మిధ్య! నవ్వులేడుపులు మిధ్య!
నమ్మరాదీ జగము..ఆ..ఆ..
ఆ..ఆ..ఆ…ఆ..
ఆ కుమారి, అమాయక అమల హృదయ చలిపిడుగువంటి దావాల సవతితల్లి
మగని తన చేతి కీలుబొమ్మగ నొనర్చుకొని దురంతముల తలపెట్టే గొడ్డురాలు
వెదకి తెప్పించె కసిదీర వెర్రివాని తనయ సుకుమార గళమున తాళిగట్ట
ఆడుపులి కోరజిక్కిన లేడికూన చందమై విలపించునా సన్నుతాంగి
ఆ..ఆ..ఆ..
No comments:
Post a Comment