కస్తూరి రంగ రంగ నాయన్న
కావేటి రంగ రంగా శ్రీరంగ రంగ రంగా
నినుబాసి యెట్లు నేమరచుందురా॥
కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనపుడు
దేవకి గర్భమునను కృష్ణావతారుడై జన్మించెను॥
ఏడురాత్రులు ఒకటిగా ఏక రాత్రిని జేసెను
ఆదివారం పూటనూ అష్టమి దినమందు జన్మించెను॥
తలతోటి జననమైతే తనకు బహు మోసంబు వచ్చు ననుచు
యెదురుకాళ్ళను బుట్టెను ఏడుగురు దాదులను చంపెనపుడు॥
తన రెండు హస్తములతో దేవకి బాలుణ్ణి యెత్తుకొనుచు
అడ్డాలపై వేసుకు ఆ బాలు చక్కదనము చూచెను॥
వసుదేవ పుత్రుడమ్మా ఈబిడ్డ వైకుంఠవాసుడమ్మ
నవనీత చోరుడమ్మ ఈబిడ్డ నందగోపాలుడమ్మా॥
No comments:
Post a Comment