పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత . . పరమ పావని ఆ మాతా
సార్వభౌముడు శ్రీరామచంద్రుని.. సన్నిధి కోరేను సీత . . అదే పెన్నిధి అన్నది భూజాతా
పదునాలుగేండ్లు వనవాసమేగి.. మరలి వచ్చెను సీత.. పరమ పావని ఆ మాతా

చరణం 1 :
సత్య పరీక్షకు అగ్ని పరీక్షకు . . సాధ్వి జానకి నిలిచె
అఖిల జగములో సీత పునీతని అగ్నిదేవుడె పలికే . . అగ్నిదేవుడే పలికే
అల్పుని మాటలు ఆలకించెను.. న్యాయమూర్తి రఘురాముడు
ఆమె కలుషితని.. అడవికి పంపెను.. నిర్ధయుడా శ్రీరాముడూ
రాముని బాసిన సీత మనసులో రగిలెను ఆరని శోకము !!పదునాలుగేండ్లు వనవాసమేగి.!!
చరణం 2 :
పూర్ణ గర్భిణికి పుణ్యరూపిణికి ఆశ్రయమొసగెను వాల్మీకి
ముని ఆశ్రమమున లవకుశ జననం..
సీతకు శాంతిని కలిగించె.. సీతకు శాంతిని కలిగించె
పతి దూషణలే తలచీ కలచీ విలపించెను ఆ మాతా
పిలిచెను భూమాతా ! తల్లి గర్భమున కలిసెను భూజాతా
జనని జానకి జీవితమంతా . . తీరని వియోగమాయే !!పదునాలుగేండ్లు వనవాసమేగి.!!

No comments:
Post a Comment