Thursday, June 1, 2017

సీతారాముల కల్యాణము చూతము రారండి


సీతారాముల కల్యాణము చూతము రారండి


సీతారాముల కల్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి

చూచువారలకు చూడ ముచ్చటట.. పుణ్యపురుషులకు ధన్య భాగ్యమట
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట
ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
భక్తి యుక్తులకు ముక్తిప్రదమట.. సురలను మునులను చూడవచ్చురట !! కళ్యాణం !!


చరణం 1 :
దుర్జన కోటిని దర్పమడంచగ.. సజ్జన కోటిని సంరక్షింపగ
దుర్జన కోటిని దర్పమడంచగ.. సజ్జన కోటిని సంరక్షింపగ
ధారుణి శాంతిని స్థాపన చేయగ
ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
ధారుణి శాంతిని స్థాపన చేయగ.. నరుడై పుట్టిన పురుషోత్తముని !! కళ్యాణం !!
దశరథ రాజు సుతుడై వెలసి కౌశికు యాగము రక్షణ జేసి
జనకుని సభలో హరువిల్లు విరచి
ఆ...అ.ఆ..ఆ... అ.ఆ..ఆ.. అ.ఆ..అ..ఆ
జనకుని సభలో హరువిల్లు విరచి జానకి మనసు గెలిచిన రాముని !! కళ్యాణం !!
చరణం 2 :
సిరి కల్యాణపు బొట్టును బెట్టి.. బొట్టును బెట్టి
మణిబాసికమును నుదుటను గట్టి.. నుదుటను గట్టి
పారాణిని పాదాలకు బెట్టి..ఆ..ఆ.. ఆ ....
పారాణిని పాదాలకు బెట్టి పెళ్ళికూతురై వెలసిన సీతా !! కళ్యాణం !!
సంపగి నూనెను కురులను దువ్వి.. కురులను దువ్వీ
సొంపుగ కస్తూరి నామము తీర్చి.. నామము తీర్చి
చెంపగ వాసీ చుక్కను బెట్టి.. ఆ.. ఆ.. ఆ....
చెంపగ వాసీ చుక్కను బెట్టి.. పెళ్ళి కొడుకై వెలసిన రాముని !! కళ్యాణం !!
చరణం 3 :

జానకి దోసిట కెంపుల ప్రోవై.. కెంపుల ప్రోవై
రాముని దోసిట నీలపు రాశై.. నీలపు రాశై
ఆణిముత్యములు తలంబ్రాలుగా...
ఆ.. ఆ ..ఆ.. ఆ ఆ ఆ ....
ఆణిముత్యములు తలంబ్రాలుగా
ఇరవుల మెరసిన సీతారాముల కల్యాణము చూతము రారండి
శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...