Thursday, June 1, 2017

శబరిమలను స్వర్ణ చంద్రోదయం


శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా

శబరిమలను స్వర్ణ చంద్రోదయం
ధర్మ రక్షకుని సన్నిధిని అభిషేకం
లోకాల గారవించు అయ్యప్ప స్తోత్రం
భక్తితో పాడుకుంటాం హృదయములా !! శబరిమలను  !!
చరణం 1 :
ప్రీతియే ఉల్లమున పాలవును.. అదే చల్లని నీ ఎదను పెరుగౌను
వెన్నయే నీవిత్తు అనురాగం..నీకు నెయ్యభిషేకమునే జరిపిస్తా
నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..
శబరిమలను స్వర్ణ చంద్రోదయం  !! శబరిమలను  !!
చరణం 2 :
పుణ్యమిత్తే పన్నీరభిషేకం.. జనులు భక్తితో చేసెడి పాలభిషేకం
దివ్య పంచామృతాన అభిషేకం.. నీదు తనువంత జ్యోతివలె వెలిగేనూ
నీజాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..!! శబరిమలను  !!
చరణం 3 :
దోసిట పుణ్య జలం అందుకొని.. అదే నీ పేరు స్తుతియించి శిరసునుంచి
కరుగు విభూతితో అభిషేకం.. హరి యోమని చందనంతో అభిషేకం
నీ జాడలలో నడిచే జీవులమయ్యప్పా...
ఈ సర్వస్వం నీ ఆశీర్వాదం అయ్యప్పా...
అయ్యప్పా.. శరణమయ్యప్పా..
అయ్యప్పా.. శరణమయ్యపా..!! శబరిమలను  !!
అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా
అయ్యప్పా.. శరణం అయ్యప్పా

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...