Thursday, June 1, 2017

రాగం: చక్రవాకం - రాధకు నీ వేర ప్రాణం

రాగం: చక్రవాకం - రాధకు నీ వేర  ప్రాణం 



రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణంరాధా హృదయం మాధవ నిలయం
రాధా హృదయం మాధవ నిలయం
ప్రేమకు దేవాలయం.......
ఈ రాధకు నీవేర ప్రాణంఈ రాధకు నీవేర ప్రాణం

చరణం 1:

నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ ప్రియ వదనం వికసిత జలజం
నీ దరహాసం జాబిలి కిరణం
నీ శుభ చరణం.....
నీ శుభ చరణం ఈ రాధకు శరణం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం

చరణం 2:

బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
బృందావనికి అందము నీవే
రాసక్రీడకు సారధి నీవే
యమునా తీరం........
యమునా తీరం రాగాల సారం
రాధకు నీవేర ప్రాణం..ఈ రాధకు నీవేర ప్రాణం

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...