Thursday, June 1, 2017

శ్రీ రామచంద్రుని సేవించినను చాలు

 శ్రీ రామచంద్రుని సేవించినను చాలు

 శ్రీరామచంద్రుని సేవించినను చాలు
శాశ్వతానందమును శాంతియును కలుగు

1. భరతుడే సేవించె పాదుకలనే కొలిచి
లక్ష్మణుడు సేవించె నిద్ర హారము మాని
గుహుడు సేవించెను పాదములు స్పృసియించి
శబరి సేవించెను మధుర ఫలముల నొసగి !!  శ్రీరామచంద్రుని !!
2. మారుతి సేవించె మనసు రంజిల్లగా
వాల్మీకి సేవించె రామ రామ యనుచు
గోపన్న సేవించి గోపురములే కట్టె
త్యాగయ్య సేవించి మధుర గానముచేసె  !!  శ్రీరామచంద్రుని !!

3. శ్రీ రామ సేవకులుయెందరెందరో గలరు
సేవ లెన్నయొ చేసి తరియించినారు
శ్రీ రామ సేవనము సంతోష భరితము
ముచ్చట గొలుపునది ముక్తి దాయకమిది  !!  శ్రీరామచంద్రుని !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...