Thursday, June 1, 2017

రామ రామ యనవె ఓ రామ చిలుక

రామ రామ యనవె ఓ రామ చిలుక
నీ నోట వే వేల వరహాలు వొలక

1. వరహాల మూటలను వరుసగా గొనిపోయి
భద్రాద్రి నంతటను బంగారు చేదాము
నీ సంతతి చేత నిత్యము పలికించు
సత్య వ్రతుండైన శ్రీ రామ నామాలు !! రామ రామ  !!

2. రవ్వల పేరుల మువ్వల కడియాల
పచ్చలు కెంపులు పొదిగిన హారముల
వన్నెలే దిద్దుదము వైభవముగా మనము
వాడ వాడల నున్న రామ మందిరమ్ములకు  !! రామ రామ  !!

3. శ్రీ రామ మందిరము లేదని ఎవరనిన
శీఘ్రమే మందిరము నిర్మించి వేతాము
సీతా సమేతుడై శ్రీ రాముడే వెలయ
ఆంజనేయుడు వారి నమిత భక్తితొ కొలువ  !! రామ రామ  !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...