చూడాలని వుంది బాబా చూడాలని వుంది
షిరిడీలోన బాబా ఓ సాయి బాబా
చూడాలనివుంది నిన్ను చూడాలని వుంది
1. చూపులోన చూపుకలిపి ఒక్కసారి చూడాలని
చక్కనైన మనసుతో తపన చెందుచుంటి నేను
2. పలుకులోన పలుకు కలిపి ఒక్కపలుకు పలకాలని
మనసంతా మధురమైన తలపుతోనుంటి నేను
3. నీపాదాలను స్పృశించి నీరాజనమివ్వాలని
వేదన భరియించలేక వేచి యుంటి నేను
4. నీలోగల చైతన్యము నిత్యము దర్శించాలని
వస్తావు వస్తావని యెదురు చూచుచుంటి నేను
5. చిత్తమునేకాగ్రపరచి నీ చిత్తరువును చూచుచు
హృదయగుహలోన నిన్ను పదిలపరచుకొంటి నేను
షిరిడీలోన బాబా ఓ సాయి బాబా
చూడాలనివుంది నిన్ను చూడాలని వుంది
1. చూపులోన చూపుకలిపి ఒక్కసారి చూడాలని
చక్కనైన మనసుతో తపన చెందుచుంటి నేను
2. పలుకులోన పలుకు కలిపి ఒక్కపలుకు పలకాలని
మనసంతా మధురమైన తలపుతోనుంటి నేను
3. నీపాదాలను స్పృశించి నీరాజనమివ్వాలని
వేదన భరియించలేక వేచి యుంటి నేను
4. నీలోగల చైతన్యము నిత్యము దర్శించాలని
వస్తావు వస్తావని యెదురు చూచుచుంటి నేను
5. చిత్తమునేకాగ్రపరచి నీ చిత్తరువును చూచుచు
హృదయగుహలోన నిన్ను పదిలపరచుకొంటి నేను
No comments:
Post a Comment