రఘురాముని భక్తుడవై నీవు
రఘురాముని భక్తుడవై నీవు రమాయని రచియించిన ఆంజనేయ,
శ్రీ రాముని భక్తుడవై నీవు రమాయని రచియించిన వాయుపుత్ర
1రామాయనెడి నామముతో రాముని మదిలో దాచితివీ
భవబంధములను బాపెడు నామము భక్తులకు ఇలనేర్పితివి --రఘురాముని --
2ఎంతో శ్రమయగు సంజీవిన్, అవలీలగా అందించితివీ
వానర సైన్యము, తోటి నీవు వారధిని దాటించితివీ .. --రఘు రాముని--
3సప్త సముద్రములను దాటి, రావణ లంకకు యేతెంచి
సీతను గాంచి, లంకను గాల్చి, రా....ములకు వార్తను తేచి --రఘు రాముని--
No comments:
Post a Comment