Tuesday, June 6, 2017

రేవతి : అల్లా ... శ్రీ రామా... శుభకరుడు సురుచిరుడు

రేవతి : అల్లా ... శ్రీ రామా... 

శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడె వడు
కళ్యాణ గునఘనుడు కరుణా ఘనా ఘనుడు ఎవడు
అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు
ఆనంద నందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడు కాక ఇంకెవ్వడు
తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం
తాగరా శ్రీ రామ నామామృతం ఆనామమే దాటించు భవ సాగరం

ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలిసిన మూర్తి
ఏ మూర్తి ముజ్జఘంభుల మూలమౌ మూర్తి
ఏ మూర్తి శక్తి చైతన్య మూర్తి
ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి
ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి
ఏ మూర్తి జగదేక చక్రవర్తి
ఏ మూర్తి ఘనమూర్తి ఏ మూర్తి గుణ కీర్తి
ఏ మూర్తి అడగించు జన్మజన్మలఆర్తి
ఏ మూర్తి ఏ మూర్తి యునుగాని రసమూర్తి
ఆ మూర్తి శ్రీరామచంద్ర మూర్తి

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

పాపాప మపనీప మపనీప మపసనిప మాపామ శ్రీ రామా
పాపాప మపనీని పనిసాస రిరిసనిప మాపాని మపమా కోదండ రామా
మపనిసరి సానీ పానీపామా సీతారామా
మపనిసరి సా రీ సరిమరిస నిపమా ఆనందరామా
మా ,మా రిమరిమరి సరిమా, రామా జయరామా
సరిమా రామా సపమా రామా
పా ఆ ఆ ఆ వన రామా
ఏ వేల్పు ఎల్ల వేల్పులును గొల్చెడి వేల్పు
ఏ వేల్పు ఏడేడు లోకాలాకే వేల్పు
ఏ వేల్పు నిటూర్పు ఇలనునిల్పు
ఏ వేల్పు నిఖిల కల్యాణముల కలగల్గు
ఏ వేల్పు నిగమ నిగామలన్నిటిని తెల్పు
ఏ వేల్పు నింగి నేలలనుకల్పు
ఏ వేల్పు ద్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు
ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు
ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేర్పు
ఆ వేల్పు దాసాను దాసులకు కైఒడ్పు

తాగరా ఆ ఆ ఆ తాగరా శ్రీ రామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం...

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...