Thursday, June 1, 2017

మానవ సేవే మాధవ సేవని

మానవ సేవే మాధవ సేవని

మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
మానవ సేవే మాధవ సేవని, బోధించినాడు ఒక బాబా
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

చరణం: 1
మమతా కరుణా రక్తం , తరగని సహనం ఊపిరిగా
పలికే పలుకే వేదముగా , ప్రియ భాషణమే మంత్రముగా
ప్రేమే సత్యమని , ప్రేమే .. దైవమని
బోధించినాడు ఒక బాబా                               
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

చరణం : 2
సిరి సంపదలు ఎన్నున్నా , శీలము విలువ చేయుమని
సుఖభొగములే నీవైనా , దొరకని ఫలమే శాంతమని
ప్రేమే సాధనగా, బ్రతుకే ధన్యమని
బోధించినాడు ఒక బాబా                               
ఆ సత్వ మూర్తి  శ్రీ సాయి బాబా 
షిర్డీ లోన ఉన్న షిర్డీ సాయి బాబా                      -- మానవ సేవే --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...