Thursday, June 1, 2017

లక్ష్మీ రావే మా ఇంటికి



లక్ష్మీ రావే మా ఇంటికి, క్షీరాబ్ది పుత్రి, మహా లక్ష్మి రావే మా ఇంటికి
లక్ష్మీ రావే మా ఇంటికి, రాజీతముగా నిన్ను కొలుతు,
ఎల్ల సంపదల నొసగే, సుందరి సుకుమారి తల్లి -- లక్ష్మీ --

ఎట్ల నిను ఎత్తుకుందు నమ్మ, మహాలక్ష్మీ తల్లి
ఎట్ల నిను ఎత్తుకుందు నమ్మ.
ఎట్ల నిను ఎత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు,
ఇట్లా రమ్మనుచు పిలిచి కోట్ల వరమిచ్చే తల్లి, -- ఎట్ల నిను ఎత్తుకుందు నమ్మ --


పసి బాలవైతే ఎత్తుకుందు, మహాలక్ష్మీ తల్లి,
పసిడి బుగ్గల పాల వెల్లి,
పూలు పండ్లు తోరణ ములతో, పాల వెల్లి కట్టిన వేదిక పై,
కలహంసా నడకలతోటి, ఘల్లు ఘల్లుల నడిచే తల్లి -- ఎట్టా నిను ఎత్తుకుందు నమ్మ --

మల్లె పువ్వులతో, పుజించేము, మహాలక్ష్మీ తల్లి,
మనసు మందిరము లో నిను నిలిపేము,
మగువలంత ఒకచో చేరి, మహాలక్ష్మీ రో నిన్ను కొలిచి
సౌభాగ్యం ఇమ్మని నిన్ను, చాల వేడెదము తల్లి -- లక్ష్మీ --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...