Thursday, June 1, 2017

శ్రీశైల భ్రమరాంబిక ……. ఓ చల్లని తల్లి




శ్రీశైల భ్రమరాంబిక ……. ఓ చల్లని తల్లి
వెలుగుల వెళ్లి ….. సౌభాగ్య వల్లి -- శ్రీశైల --

కదలిన సిరులోలుకు కమనీయ పాదం

మమతలు వర్షించు మంజీర నాదం
ఆ నగుమోము అతి నవ్య వేదం
అవనికి తొలి దీపం, ఆ దివ్య రూపం -- శ్రీశైల--

శుభకర హస్తాన అభయ మూసంగి

మంగళ నయనాల మము తీర్చిదిద్ది
కైవల్య సుమమాల కంఠాన దాల్చి
సకల జనాలను కాపాడు తల్లి --శ్రీశైల--

జ్ఞాన నియమున చూడగలిగితే కనిపించు దైవం

మల్లికార్జునుని అర్ధ దేహమున పల్లవించు తల్లి
జరజన్మ మూర్తుల నొసగు స్వరూపిణి
కరుణను వెదజల్లు కల్యాణి వాని --శ్రీశైల--

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...