Tuesday, June 6, 2017

అభేరి– నగుమోము కనలేని



అభేరి–ఆది

నగుమోము కనలేని నా జాలి తెలిసి–

నను బ్రోవగరాదా?శ్రీ రఘవర ! నీ IIనగుII

నగరాజధర! నీదు పరివారు లెల్ల

ఓగి బోధన చేసే వారలు కారే! అటులుండుదురే! నీ IIనగుII

ఖగరాజు నీ యానతి విని వేగ చనలేడో

గగనానికిలకు బహు దూరంబనినాడో

జగమేలే పరమాత్మ! ఎవరితో మొరలిడుదు

వగజూపకు తాళను నన్నేలుకోరా? త్యాగరాజనుత!(నీ) IIనగుII

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...