Tuesday, June 6, 2017

రామా రామభద్ర రవివంశరాఘవ



రామా రామభద్ర రవివంశరాఘవ

యేమి యరుదిది నీకింతటివానికిని

చ. 1: నాఁడు రావణు తలలు నఱకిన లావరివి

నేఁడు నాపాపములు ఖండించరాదా

వాఁడిప్రతాపముతోఁడ వారిధిగట్టిన నాటి–

వాఁడవిట్టె నామనోవార్ధిఁ గట్టరాదా

చ. 2: తనిసి కుంభకర్ణాది దైత్యుల గెలిచితివి

కినిసి నాయింద్రియాల గెలువరాదా

యెనసి హరుని విల్లు యెక్కుపెట్టి వంచితివి

ఘనము నాదుర్గుణము కడు వంచరాదా

చ. 3: సరుస విభీషణుఁడు శరణంటేఁ గాచితివి

గరిమ నే శరణంటిఁ గావరాదా

తొరలి శ్రీవేంకటేశ దొడ్డుగొంచ మెంచనేల

యిరవై లోకహితానకేదైనా నేమీ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...