Tuesday, June 6, 2017

రావయ్యా రావయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా

రావయ్యా రావయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా 

 రావయ్యా రావయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా

నీ క్షేత్రమ్మిదియేనయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా

పుణ్య క్షేత్రమ్మిదియేనయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా 


1.గోపాలుడవీవయ్యా శ్రీ కాళీక్రిష్ణయ్యా 

గోరుముద్దలున్నవయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

ఆరగింప రావయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

ఆనందించెదమయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా 


2.క్షీరమెంతొ గలదయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా

క్షీరాన్నమె తినవయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

వెన్నలారగింపవయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

వెన్నవంటి మనసు నీది శ్రీ  కాళీక్రిష్ణయ్యా

3.ధూప దీపమున్నదయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

నయివేద్యము వున్నదయ్య శ్రీ కాళీక్రిష్ణయ్యా  

వున్నదంత నీదయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

మేమందరం నీవారమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 


4.వరములేమి కోరమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

నీ రాక మాకు వరమయ్యా శ్రీ  కాళీక్రిష్ణయ్యా

నిరీక్షించుచుంటిమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా

నీ సేవ చేసుకొందుమయ్య శ్రీ  కాళీక్రిష్ణయ్యా 

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...