వైకుంఠమందు వెలసిన ఓ శ్రీ మహాలక్ష్మీ
నీ భక్తులను కనికరించ రావేమమ్మ --వైకుంఠమందు --
శేషశయ్య పై నువ్వు వెలసి వున్నావు, నీ పతి సేవలో నీవు ఎపుడు మునిగి వున్నావు
ఈ గతిలేని పేదల మొర లలించమ్మ
ఏ గతి ఐనా మమ్మెపుడు ఏలు కోవమ్మ -- వైకుంఠమందు --
కలిగున్నవారి లోగిలిలో నీవు వున్నావు, ఈ కలిలోన ఆకలితో మేము వున్నాము
కలకాలం మా కొరతలు తీర్చవేమమ్మ
ఈ కలియుగ మానవునికి మోక్షమియమ్మ -- వైకుంఠమందు--

No comments:
Post a Comment