సౌభాగ్యలక్ష్మీ రావమ్మ, అమ్మ
నుదిటి కుంకుమ రవి బింబముగా, కన్నుల విందుగ కాటుక వెలుగ,
కాంచన హారము గళమున మెరియగ, పీతాంబరముల శోభలు నిండుగా -- సౌభాగ్య --
నిండుగ కరముల బంగరు గాజులు, ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు
గల గలమని సవ్వడి చేయగ, సౌభాగ్యవతుల సేవలనందగ -- సౌభాగ్య --
నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్త జనుల మా కల్పవల్లివై,
కమలాసనవై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి -- సౌభాగ్య --
జనక రాజుని ముద్దుల కొమరిత, రవికుల సోముని రమణీవై
సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చేడి దీవేనలీయగా -- సౌభాగ్య --
కుంకుమ శోభిత పంకజ లోచని వెంకట రమణుని పట్టపురాణి
పుష్కలముగా సౌభాగ్యములు ఇచ్చే, పుణ్య మూర్తి మా ఇంట వెలసిన -- సౌభాగ్య ..—
సౌభాగ్యమ్ముల బంగరు తల్లి, పురంధర విట్టలుని పట్టపు రాణి,
శుక్ర వారము పూజలనందగా, సాయం సంధ్యా శుభ ఘడియలలో -- సౌభాగ్య ..—

No comments:
Post a Comment