Thursday, June 1, 2017

ముజ్జగమ్ముల గన్న మా అమ్మ

ముజ్జగమ్ముల గన్న మా అమ్మ,
దేవాది దేవి మంగలమ్ములు కొనగా రావమ్మ
ముంముర్తుల శక్తి నీవే, ముగ్గురమ్మల మూలం నీవే
ముదితలకు మాంగల్య రక్షణ చేసి మురిసేది దాన నీవే -- ముజ్జగమ్ముల --

చరణం: 1
మందహాస దయా విలసితాక్షి, ఆనంద మందిర
మంగళకర మధుర మీనాక్షి
చందురుని మించిన ముగంబున చుక్క నొక్కిన ముక్కు వజ్రము
అందెల అడుగుల అనగి బ్రోవ ఆత్మజుల మమ్మేలు రావా -- ముజ్జగమ్ముల--

చరణం : 2
వారణాసి విశాలక్షివే, శ్రీ విశ్వనాధుని
వామ భాగము నందు వేలుగుదువే
ఘోర కల్మష హరిణి కాంచి విహారిణి కామాక్షి
భారకర సంసార భాగోత్తరిని పద్మాక్షి దేవి -- ముజ్జగమ్ముల--

చరణం : ౩
నిఖిల నిగమ నిధాన గాయత్రి, లోకైక నేత్రి
సుఖ సమున్నత శాంతి సంధాత్రి,
ముకర చంద్రో వర్ణ గాత్రి , ముక్త హార త్రినేత్రి
ప్రహర శుద్ధ వినాష సూత్రి , బాల రఘురామాభి నేత్రి
ముజ్జగమ్ముల గన్న మా అమ్మ,
దేవాది దేవి మంగలమ్ములు కొనగా రావమ్మ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...