Sunday, June 4, 2017

మధురము శివమంత్రం

మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా! |మధురము|
ఇహపర సాధనమే....ఏ......ఏ.....
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే..
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే |ఇహపర|


ఆగమ సంచారా
ఆగమ సంచారా, నా స్వాగతమిదె గొనుమా.. |ఆగమ|
భావజ సంహారా...
భావజ సంహారా.....
భావజ సంహారా... నా నన్ను కావగ రావయ్యా |భావజ|


పాలను ముంచెదవో.. ఓ.. ఓ.. ఓ..
పాలను ముంచెదవో, మున్నీటను ముంచెదవో.. |పాలను|
భారము నీదయ్యా |భారము|
పాదము విడనయ్యా, నీ పాదము విడనయ్యా..
జయహే సర్వేశా!
జయహే సర్వేశా! సతి శాంభవి ప్రాణేశా!..ఆ.. |జయహే!|
కారుణ్య గుణసాగరా!..
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
కారుణ్య గుణసాగరా!
శ్రీకాళహస్తీశ్వరా నన్ను కాపాడవా శంకరా!
మధురము శివమంత్రం మహిలో మరువక ఓ! మనసా!
ఇహపర సాధనమే నరులకు సురుచిర తారకమే

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...