రాగం : హంస ధ్వని - హే గణనాయక సిద్ధివినాయక
హే గణనాయక సిద్ధివినాయక
జయహో మంగళ దయకా
సురగణ వందిత - వామన రూప
సుమధుర వేష - స్వరూప ఆ ఆ ఆ
మూషికవాహన - హే గజానన
ముదముతో మమ్ముల గనుమా !! హే గణనాయక !!
సర్వ కళలకూ - నిలయమైన
ఆ నటరాజే - మన తండ్రి కదా
సిద్ది వినాయక -భక్తులందరిని
బ్రోచే భారము - నీవే కదా !! హే గణనాయక !!
No comments:
Post a Comment