సీతా మాతను జూచితి రామా
పల్లవి..... సీతా మాతను జూచితి రామా
శ్రీ రఘు రామా శ్రీ రామా
1. లంక యంతయును వెదకితి రామా - అశోక వనమున గాంచితి రామా
శోకము నందెను జానకి రామా - రావణు బారిన పడినది రామా
నీవే దిక్కని నమ్మెను రామా - నిత్యము నిన్నే కొలచును రామా
నీ ముద్రికనే యిచ్చితి రామా - చూడామణి నే తెచ్చితి రామా
2. రాక్షస బలమును గాంచితి రామా - రాక్షసులను బరిమార్చితి రామా
రావణ సుతుడే వచ్చెను రామా - అక్షకునే హతమార్చితి రామా
బ్రహ్మాస్త్రమునకు లొంగితి రామా - రావణు కొలువు జొచ్చితి రామా
రావణు గర్వము జూచితి రామా - రాముడె శరణనమంటిని రామా
3. విషయమంత వినిపించితి రామా - విరోధమ్ము వలదంటిని రామా
సీతను నీ చెంతకు రామా - శీఘ్రమే చేర్చమనంటిని రామా
విషపు నవ్వునే నవ్వెను రామా - విరోధినని దూషించెను రామా
4. నన్ను చంపగా నెంచిరి రామా - విభీషణుండె వలదనె రామా
వాలమునకు వల పన్నిరి రామా - చీరల నెన్నియొ చుట్టిరి రామా
వారు రగిల్చిన అగ్నితొ రామా - లంకా దహనము చేసితి రామా
సీత క్షేమము చూసితి రామా - శీఘ్రమే నీ దరి చేరితి రామా

No comments:
Post a Comment