Thursday, June 1, 2017

హరతిదిగో ఇందిరా అలవేణి చేకొనవమ్మ


హరతిదిగో ఇందిర

హరతిదిగో ఇందిరా అలవేణి చేకొనవమ్మ సారస మందిరా....... --హారతి ---
క్షీరసాగర పుత్రలేమిడి భారమాయెను
తరము గాదిక, మారజనని నేరమెంచక
కోరి నీకిపు డోస గెదను జయ -- హారతి--

ధరణిపై జన్మించియు, మిథిలేషుని
ధామమందున పెరిగియు
కరుణతో మునివరుని యాగము కాచి రాతిని నాతి చేసిన
హరుని కోదండంబు విరిచిన నరుని గుడిన సేత కర్పూర -- హారతి --

వరలక్ష్మి నిను భక్తితో పూజింతును శుక్రవారము రక్తితో
విరల తల్పము నందు వరునితో మరలికేళిలో గుడియుండగా
హరికి దేలుపవే నన్ను బ్రోవమటంచు మ్రొక్కెద కమల శాంభవి -- హారతి --

అన్న రుక్మదుడు నిన్ను శిశుపాలున కొసగెడ ననిన మున్ను
చిన్నబోయి చింతించి విప్రునకెన్నో విధముల తెలిపి పంపిన
చిన్నికృష్ణుని బొందె భీష్మ కన్యరుక్మిణి నీకు కర్పూరా -- హారతి --

వాసుదేవుని రాణివో జనులను బ్రోచి వాన్చాలోసాగేడి దానవో
వ్యాసతనకన దక్షిణ కాశిలో నివసించు లింగా
దాసునకు, సిరులోసగు నక్షత్రేషు సోదరి నీకు కర్పూరా -- హారతి --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...