Thursday, June 1, 2017

హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి దేవికి



హారతి మీరేల ఇవ్వరే, మహాలక్ష్మి దేవికి

హారతి మీరేల ఇవ్వరే .. సారసాక్షికి లలిత దేవికి
లీలతో వెలుగొందు తల్లికి పాలిత పద్మజకిపుడు -- హారతి --


పాదములకు పూజ చేయరే
పద్మాక్షికిపుడు, పారిజాతపు హారమీడరే
ఆణిముత్యపు హారముల - బంగారు గజ్జెల రవ్వల పావడ
అరయచందన బొట్టు నుదుటన
అమరామోమలరేడు జననికి -- హారతి --

ఇంతరురాకేల ననారే - ఇందిరా రమణికి
పంతమేల మానుమనారే
పద్మవాసిని పరంజోతికి, పద్మిని మా మనోహరిణిని
పద్మనాభుని రాణికిపుడు పద్మిని మనోహరికిని -- హారతి --

లక్షముగాను జోతి గుర్చారే - మా దేవితోనిక
అక్షయంబుల నోసగమనారే
ఈప్పితంబుల నొసగు మాతకు
అమరవంధ్యకు ఆదిదేవికి
రక్షిత మంతెన్ననిలయకు
పంకజాక్షికి పద్మకిపుడుం -- హారతి --

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...