Thursday, June 1, 2017

సింగారపు చెలువకు చేమంతుల

సింగారపు చెలువకు చేమంతుల ఘుమఘుమలు
పొంగారు పొలతికి ముద్దబంతుల మధురిమలు
చెంగావి కోకరతకు శ్రీ గంధపు చిలకరులు
చిరునవ్వుల సిరులందించే - దేవికి హారతులూ
శ్రీ దేవికి హారతులూ
శివ దేవికి హారతులూ

శివదేవికి చేతుల నిండుగా తైలంబిడరండీ
చెలియల్లారా పన్నీట జలకము లాడించండీ
నెలదాలపు కింపొసగే దువ్వలువలు కట్టండీ
నీలాల కురులను దువ్వి తిలకము దిద్దండీ ...
కుంకుమ తిలకము దిద్దండీ...
జలతారు మేలిముసుగుల పోలతికి నవతాలు ...
మా ఇలవేలుపు లలితాంబకు జయ మంగళ హారతులూ
శుభ మంగళ హారతులూ
జగదంబకు హారతులూ
కమ్మని నేతితో భాక్ష్యంబుల నైవేద్యం బిడరమ్మా
ఘుమఘుమలాడే పాయసాన్నముల ప్రేమనుంచరమ్మ
బంగారు పల్లెరమున భోజ్యంబుల నిడరమ్మ
సింగారపు దేవికి తృప్తిని జెందనీయరమ్మా ....
మీరు చెందనీయరమ్మ....
కమ్మని కప్పుర విడమిడి దేవికి వీవరే వీవనలు
కలకంటిని పూసేజ్జను పవళింపగా చేయరే చెలులు
పాడరే హారతులూ
జయ మంగళ హారతులూ
శుభ మంగళ హారతులూ

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...