Tuesday, June 6, 2017

కాళీకృష్ణ అని పలికినవారికి

(ప్రేమ యాత్రలకు అను వరుస )

కాళీకృష్ణ అని పలికినవారికి
భాదలు భయమూ ఎందుకు
సాలెపురుగులా  గూటికి చిక్కిన
జీవులందరికి మోక్షము !!కాళీకృష్ణ !!

1. పరమ గురునకు మనకి మధ్యన
అడ్డుగోడయే ఆశరా
ఆ అడ్డుగోడనే ఛేదించినచో
సద్గురు సన్నిధి చేరురా !!కాళీకృష్ణ !!

2. కలిమి లేములు కష్ట సుఖాలు
పగలూ రేయిగా సహజమురా
నాది నాదను అహము విడచిన
సద్గురు సన్నిధి చేరరా !!కాళీకృష్ణ !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...