రావయ్యా రావయ్యా హనుమా
రామయ్య కీర్తన మనసార వినుమా
రామ నామము పలక సంశెయాల మనసు
సంశెయాల మర్మమేమో రామునికే తెలుసు
దారి చిక్కని మనసు మనవి వినుమా
రావయ్యా రావయ్యా హనుమా
కరుడుకట్టిన మనసు ఎన్నడు పల్కునో రామయని
కర్మపాశములు ఎన్నడు వీడునో శెలవుయని
పలికించెడి వాడు పలుకకుండే కిమ్మని
పరుగిడి వచ్చేనేమో నీవునూ ఉన్నావని
రావయ్యా రావయ్యా హనుమా
రామ కీర్తన పల్కించ మా మనవి వినుమా
కనులుండి కనలేను కమనీయ రూపము
ఎలా పొందితినో ఈ ఘోర శాపము
ఎప్పుడు చేసితినో స్వామిని చేరనియ్యని పాపము
నువ్వుండ దొరకునేమో నే కోరిన వరము
రావయ్యా రావయ్యా హనుమా
రాముని రూపము మనసారా కనుమా
రామయ్య కీర్తన మనసార వినుమా
రామ నామము పలక సంశెయాల మనసు
సంశెయాల మర్మమేమో రామునికే తెలుసు
దారి చిక్కని మనసు మనవి వినుమా
రావయ్యా రావయ్యా హనుమా
కరుడుకట్టిన మనసు ఎన్నడు పల్కునో రామయని
కర్మపాశములు ఎన్నడు వీడునో శెలవుయని
పలికించెడి వాడు పలుకకుండే కిమ్మని
పరుగిడి వచ్చేనేమో నీవునూ ఉన్నావని
రావయ్యా రావయ్యా హనుమా
రామ కీర్తన పల్కించ మా మనవి వినుమా
కనులుండి కనలేను కమనీయ రూపము
ఎలా పొందితినో ఈ ఘోర శాపము
ఎప్పుడు చేసితినో స్వామిని చేరనియ్యని పాపము
నువ్వుండ దొరకునేమో నే కోరిన వరము
రావయ్యా రావయ్యా హనుమా
రాముని రూపము మనసారా కనుమా
No comments:
Post a Comment