శ్రీ రామ జయరామ సీతారామ
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ
నీ దివ్య నామం మధురాతిమధురం
నేనెన్న తరమా నీ నామ మహిమ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ
చరణం:1
చరణాలు కొలిచే నగుమోము చూచే ఆ
చరణాలు కొలిచే నగుమోము జూచే
సామ్రాజ్యమిచ్చావు సాకేతరమా
నీ కీర్తి చాటగా నా కోసమే నీవు
అవతారమెత్తేవు సుగుణాభిరామా
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ
చరణం:2
నిలకడలేని అల కోతి మూకచే
నిలకడలేని అల కోతి మూకచే
కడలిపై వారధి కట్టించినావే
పెను కడలిపై వారధి కట్టించినావే
నీపేరు జపియించ తీరేను కోర్కెలు
నీపేరు జపియించ తీరేను కోర్కెలు
నేనెంత నుతియింతు నా భాగ్య గరిమ
శ్రీ రామ జయరామ సీతారామ
కారుణ్యధామా కమనీయనామా
శ్రీ రామ జయరామ సీతారామ
No comments:
Post a Comment