రాగం : భాగేశ్వరి -- దేవా దైవా ప్రభో ఓ శ్రీ కాళీకృష్ణయ్య నమో నమో
దేవా దైవా ప్రభో - ఓ శ్రీ కాళీకృష్ణయ్య నమో నమో
కన్నుల విందగు నిన్ను చూసిన - కలిగింతువయా సౌభాగ్యం
మాటలు కాదు చేతలేనని - చూపింతువయా నీ మహిమ
1. నిర్మలమైన మనసుతో కాళీ - కృష్ణ అని నిను చేరెదను
చేరువనున్న దేవుని విడచి - ఎక్కడోఉందని బ్రమలేలయ్యా !!దేవా దైవా ప్రభో !!
2. ధరణికి నీవే దైవంబనిన - భక్తులనెపుడూ విడనాడవుగా
నీ సేవ చేసే నిర్భాగ్యులకు - నిలువ నీడగ నిలచెదవయ్య !!దేవా దైవా ప్రభో !!
3. నామము తలచిన మృత్యువు నైనా - జయించెదము సులభముగా
మంత్ర తంత్రముల మాయలు సున్నా - నామము ముందు పనిచేయవులే !!దేవా దైవా ప్రభో !!
No comments:
Post a Comment