Monday, May 29, 2017

రాగం : మోహన -- ఎక్కడా దాగున్నావమ్మా చక్కనైన ఓ కనకదుర్గ

రాగం : మోహన -- ఎక్కడా దాగున్నావమ్మా చక్కనైన ఓ కనకదుర్గ 

ఎక్కడా దాగున్నావమ్మా   చక్కనైన ఓ కనకదుర్గ

1. నీవు బెజవాడలోన -నిదురపోవుచున్నావేమో
ఒక్కసారి కానరావా ఓ హో కనకదుర్గా !!ఎక్కడా దాగున్నావమ్మా !!

2. నూట ఒక్క దేవతలోన - ఉగ్రమైన దేవతవమ్మా
ఒక్కసారి కానరావా ఓ హో కనకదుర్గా !!ఎక్కడా దాగున్నావమ్మా !!

3. ఫులి వాహన మెక్కేవమ్మా - పదిచేతులు కల్గిన తల్లి
ఒక్కసారి కానరావా ఓ హో కనకదుర్గా !!ఎక్కడా దాగున్నావమ్మా !!

4. కొండపైన కోవెలలోన -కొలుతురమ్మా  భక్తులెల్లరు
ఒక్కసారి కానరావా ఓ హో కనకదుర్గా !!ఎక్కడా దాగున్నావమ్మా !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...