రాగం : తిలకాంభోజి -- ఇమ్మా సుజ్ఞానము అమ్మలకు అమ్మ మా యమ్మ
ఇమ్మా సుజ్ఞానము - అమ్మలకు అమ్మ
మా యమ్మ సీతా మహాలక్ష్మి
1, నీ పాదములపై వాలిన క్షణమె - తరియించెనమ్మా నా జన్మం
నీకే కానుక నివ్వగలనమ్మా - ఇచ్చేందుకు నా వద్దెమున్నది !! ఇమ్మా సుజ్ఞానము !!
2. ఘనుడౌ సద్గురు కాళీకృష్ణుని - సతియై జగముల నేలెదవు
జ్ఞాన హీనుడని యోచించి -జనకుడు నాపైన కినుక వహింపగ !!ఇమ్మా సుజ్ఞానము !!
3. యిలవేలుపువై వెలసితివమ్మా - ఈ ధారుణిలో సీతమ్మా
నిలకడ చూపవె నా యెడ తల్లి - నీవే నన్నిల దిక్కేవరమ్మా !! ఇమ్మా సుజ్ఞానము !!
4. యతి గణ ప్రాసలు ఎరుగని నేను - ప్రతిపాటను నే పాడితిని
నా కృతి దోషము సవరింపుమని - బ్రతిమాలితినీ శ్రీతమందారి !!ఇమ్మా సుజ్ఞానము !!

No comments:
Post a Comment