Wednesday, May 31, 2017

రాగం : అభేరి - తెలవారదేమో స్వామీ

రాగం : అభేరి - తెలవారదేమో స్వామీ


తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో .. అలసిన దేవేరి
అలమేలు మంగకూ.. !! తెలవారదేమో !!

1, చెలువమునేలగ .. చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి  అలసిన దేవేరి
అలమేలు మంగకూ.!!తెలవారదేమో!!

2. మక్కువ మీరగ .. అక్కున జేరిచి
అంగజు కేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తు నే మది మరి మరి తలచగా
మరి మరి తలచిగ   అలసిన దేవేరి 
 అలమేలు మంగకూ..!!తెలవారదేమో!!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...