Wednesday, May 31, 2017

రాగం : భీం పలాస్ -అందరి బందువయ భద్రాచల

రాగం : భీం పలాస్ -అందరి బందువయ భద్రాచల 
అందరి బందువయ భద్రాచల రామయ్య
ఆదు కునే ప్రబువయ్య ఆ అయోధ్య రామయ్య
చేయుతనేచ్చే వాడయ్య  ఆ సీత రామయ్య
కోర్కెలు తీర్చే వాడయ్య కోదండరామయ్య |!అందరి||

1. తెల్లవారితే చక్రవర్తియై  రాజ్యమునేలే రామయ్య
తండ్రిమాటకై పదవిని వదలి అడవులుకేగేనయా
మహిలో జనులను కావగావచ్చిన మహావిష్ణు అవతరమయా
ఆలిని రక్కసుడ పహరించితే ఆక్రోసించెనయా
అసురుని  ద్రుంచి అమ్మను తెచ్చి అగ్నిపరిక్ష విధించెనయా 
చాకలి నిందకు సత్య ము చాతగాకులసతినే విడనాడెనయా
నా రాముని కష్టం లోకంలో ఎవరు పడలెరయ్యా ఆ ||
సత్యం ధర్మం త్యాగంలో అతని కి సరిలేరయ్య
కరుణ హృదయుడు శరణనువాడికి అభయమొసగునయా ||అందరి||


2. భద్రాచలము పుణ్యక్షేత్రము అంత రామ మాయం
భక్తుడు భద్రుని కొండగా మార్చి కొలువై వుఉన స్థలం
పరమ భక్తితో రామదాసు ఈ ఆలయమును కట్టించేనయ
సీతారామ లక్షనులకు ఆభరణములే  చేయించెనయా
పంచవటి  ఆ జానకి రాముల  పర్ణశాల అదిగో
సీతారాములు జలకములడిన శ్రాష్ట తీర్ధమదిగో
రామభక్తితో నది గా మారిన శబరి ఇదేనయ్య
శ్రీరామ పదములు నిత్యం కడిగే గోదావరి అయ్యా
ఈ క్షేత్రం తీర్దం దర్శించిన  జన్మధన్యమయా .. ||అందరి||

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...