రాగం మోహన -- తిరుమల మందిర సుందర
తిరుమల మందిర సుందర - సుమధుర కరుణా సాగరా
ఏ పేరున నిను పిలచెనుర ఏ రూపముగా కొలిచేనురా !! తిరుమల మందిర !!
1. పాలకడలిలో శేషశయ్యపై - పవళించిన శ్రీ పతివో
వెండికొండపై నిండు మనసుతో - వెలిగే గౌరీపతివో
ముగ్గురమ్మలకు మూలపుటమ్ముగా - భువిలో వెలసిన ఆదిశక్తివో !!తిరుమల మందిర !!
2. కాంతులు చిందే నీ ముఖ బింబము -కాంచిన చాలును ఘడియైనా
నీ గుడి వాకిట దివ్వెను నేనై -నిలచిన చాలును రేయైన
నీ పదములపై కుసుమము నేనై - నిలచిన చాలును క్షణమైనా !!తిరుమల మందిర !!

No comments:
Post a Comment