Tuesday, May 30, 2017

రాగం : కళ్యాణి - సాయి చరణం..గంగా యమునా సంగమ సమానం

రాగం : కళ్యాణి

హే పాండురంగా..హే..పండరి నాథ..
శరణం..శరణం..శరణం
సాయి శరణం..బాబా శరణం..శరణం
సాయి చరణం..గంగా యమునా సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయి
మా పాండురంగడు కరుణ మయుడు సాయి

ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయి
మా పాండురంగడు కరుణ మయుడు సాయి
సాయి శరణం..బాబా శరణం..శరణం
సాయి చరణం..గంగా యమునా సంగమ సమానం

విద్య బుధులు వేడిన వాళ్ళకు అగుపించాడు విగ్నేశ్వరుడై
పిల్లపాపల కోరినవారిని కరుణించాడు సర్వేశ్వరుడై
తిరగలి చక్రం తిప్పి వ్యాధిని అరికట్టడూ..ఊఁ..విష్ణు రూపుడై
మహసా శ్యామాకు మారుతిగాను
మరికొందరికి ధత్తాత్రేయుడిగా
యద్భావం తద్బవతని దర్శనమిచాడు ధన్యుల జేసాడు

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమునా సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయి
మా పాండురంగడు కరుణామయుడు సాయి

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమునా సంగమ సమానం

పెనుతుఫాను తాకిడి లో అలమటించు దీనులను
ఆదరించే తాన నాధ నాధుడై
అజ్ఞానం అలుముకున్న అంధులను చేరదీసి
అసలు చూపు ఇచ్చినాడు వైద్యుడై
వీధి వీధి బిచ్చమెత్తి వారి వారి పాపములను
పుచ్చుకుని మోక్షమిచ్చే పూజ్యుడై
పుచ్చుకొన్న పాపములను ప్రక్షాలన చేసికొనెను
దౌథ్యక్రియ సిద్ధితో శుద్దుడై
అంగములను వేరు చేసి ఖండయోగ సాధనలో
ఆత్మ శక్తి చాటినాడు సిదుడై
జీవరాసులన్నిటికీ సాయి శరణం

కోరుస్::-- సాయే శరణం

దివ్యజ్ఞాన సాధనకు సాయి శరణం

కోరుస్::-- సాయే శరణం

ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం

కోరుస్::-- ఆస్తికులకు సాయే శరణం నాస్తికులకు సాయే శరణం
భక్తికీ సాయే శరణం ముక్తికీ సాయే శరణం

కోరుస్::-- భక్తికి సాయే శరణం ముక్తికి సాయే శరణం

సాయి శరణం బాబా శరణం శరణం
సాయి చరణం గంగా యమునా సంగమ సమానం
ఏ క్షేత్రమైన తీర్ధమైన సాయి
మా పాండురంగడు కరుణ మయుడు సాయి

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...