Tuesday, May 30, 2017

రాగం : నాదనామక్రియ : రామనామ మందుకొనరే పామరులారా

రాగం : నాదనామక్రియ : రామనామ మందుకొనరే పామరులారా

రామనామ మందుకొనరే పామరులారా
రామజోగి మందుకొనరే  !!రామనామ !!

రామజోగి మందుమీరు ప్రేమతో భుజింపరయ్య
కామక్రోధములనెల్ల గడకుపారద్రోలె మందు  !!రామనామ !!

మదమాత్సర్య లోభములను మాటలో నిలిపెడిమందు
గుదికొన్న కర్మములను గూడక యెడద్రోలెమందు  !!రామనామ !!

కాటుక కొండలవంటి కర్మము లెడబాపుమందు
సారెకు నీమంబు సాటిలేని భాగవతులు స్మరణచేసి తలచేమందు  !!రామనామ !!

ముదముతో భద్రాద్రియందు ముక్తిని పొందించేమందు
సదయుడైన రామదాసు సద్భక్తితో గొలిచేమందు  !!రామనామ !!

No comments:

ధన్యాసి రాగం : తారక మంత్రము కోరిన దొరికెను

ధన్యాసి రాగం  తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓ రన్నా ||తారక మంత్రము|| మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని నమ్మకయున్న ||...